తప్పనున్న వేతలు..

-చిన్నకోడూర్ లో  పీఆర్ డీఈ కార్యలయం
నవతెలంగాణ-బెజ్జంకి
హుస్నాబాద్ పట్టణంలో ఉన్న పీఆర్ డీఈ కార్యలయ సేవలకు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇకనుండి అ వేతలు తప్పనున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ కార్యలయ సేవలు ఇన్నాళ్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేవి.ఇప్పుడు పీఆర్ ఎస్ఈ సేవలు జిల్లా కేంద్రంలో అందుబాటులోకి రానున్నాయి.అయితే ఇన్నాళ్లు బెజ్జంకి మండల ప్రజలు పంచాయతీ రాజ్ శాఖ డీఈ కార్యలయ సేవలు హుస్నాబాద్ పట్టణంలో అందుబాటులో ఉండేవి.ఇక నుండి చిన్నకోడూర్,బెజ్జంకి మండల ప్రజలకు పంచాయతీ రాజ్ శాఖ డీఈ కార్యలయ సేవలు చిన్నకోడూర్ మండల కేంద్రంగా అందుబాటులోకి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం.జిల్లా కేంద్రంలో పీఆర్ ఎస్ఈ,చిన్నకోడూర్ మండల కేంద్రంలో పీఆర్ డీఈ కార్యలయాలను రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం ప్రారంభించనున్నట్టు సమాచారం.
Spread the love