వరి రైతులకు తరగు, తూకంలో మేాసం చేస్తే కేసులు పెట్టిస్తా: ఎమ్మెల్యే

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఖండేబల్లూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని    అదివారము నాడు  జుక్కల్ ఎమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు తనిఖి చేసారు.  ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతు తూకంలో మోసాలకు పాల్పడితే ఎంతటి వారినైన  వదిలే ప్రసక్తే లేదని,  మేాసాలకు పాల్పడే  అలాంటి వారి పైన కేసులు నమోదు చేస్తామని  హెచ్చరించారు రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచన మాయిశ్చర్ విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు,  నీస మద్దతు ధర, తూకాల గురించి ఎమ్మెల్యే గారు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము తీసుకు వచ్చిన ధాన్యంలో తాలు పేరుతో  ధాన్యం తగ్గిస్తున్నారని, మాయిశ్చర్ ప్రతి రోజూ చూడడం లేదని చెప్పారు. బస్తాకు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన వారిని బూతులు తిడుతున్నారని ఎమ్మేల్యేనైన తనకు వరి రైతులు  ఫిర్యాదు చేసారని తెలిపారు. వెంటనే ఐకెపి నిర్వాహకుడికి ఫోన్ చేసి ఈ విషయం గురించి అడగగా తాను నిర్లక్ష్యంగ సమాదాన మివ్వడంతో  రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అతనిని వెంటనే సస్పెండ్ చేసి రైతులను తరుగు పేరుతో మోసం చేయడమే గాక బూతులు తిట్టినందుకు గానూ కేసు నమోదు చేయాలని పై అధికారులకు ఆదేశాలిచ్చారు. ఐకెపి కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే ధాన్యంలో తాలు పేరుతో తూకం తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సౌకర్యంతో పాటు టెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love