పసిపాపకు సిగరెట్, మద్యం తాగించిన తల్లి

 

View this post on Instagram

 

A post shared by For Men India (@for_men_india)

నవతెలంగాణ – హైదరాబాద్
మత్తు పదార్థాలకు చిన్న పిల్లలకును వీలైనంత దూరంగా ఉంచాలని ప్రభుత్వాలు తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. పిల్లలతో ఒకే గదిలో ఉన్నప్పుడు పొగ త్రాగకూడదు, మద్యం సేవించరాదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇక్కడ ఓ తల్లి అమ్మ తనాన్నే మరిచి 20 నెలల పాపకు బలవంతంగా సిగరెట్, మద్యం తాగించిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. సిల్చార్‌కు చెందిన ఓ మహిళ 20నెలల పసిబిడ్డకు సిగరెట్, మద్యం తాపిస్తూ వేధిస్తోందని స్థానికులు.. చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారమిచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు హుటాహుటీన మహిళ నివాసానికి చేరుకుని బిడ్డను రక్షించారు. తదుపరి విచారణ కోసం తల్లిని అదుపులోకి తీసుకున్నారు. నివేదికల ప్రకారం, ఈ దుశ్యర్య గడిచిన బుధవారం(జూన్ 12) రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. పసిపాపకు పొగ, మద్యం తాగించి తల్లి వేధిస్తున్నట్లు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించి తగు చర్యలు తీసుకున్నట్లు చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బిడ్డను రక్షించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కస్టడీలో ఉన్నారని, సమగ్ర విచారణ జరిపాక తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Spread the love