నామినేషన్‌ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

– ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్‌ప్రతాప్‌సింగ్‌
నవతెలంగాణ-వరంగల్‌
అసెంబ్లీ సాధారణ ఎన్నికల కొరకు అభ్యర్థులు నామి నేషన్లను దాఖలు చేసినప్పుడు రిటర్నింగ్‌ అధికారి ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్‌ ప్రతాప్‌సింగ్‌ పేర్కొన్నారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన 106 వరంగల్‌ తూర్పుఅసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధి కారి కార్యాలయాన్ని ఆయన సందర్శించగా ఆర్‌ఓ షేక్‌ రి జ్వాన్‌బాషా అమిత్‌ప్రతాప్‌సింగ్‌కు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సహాయ ఎన్నికల వ్యయ పరిశీలన కా ర్యాలయంలో అభ్యర్థుల ఖర్చుల నమోదు వివరాలను పరి శీలించి నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సంద ర్భంగా అమిత్‌ ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ నామినేషన్‌ నాటి నుండి అభ్యర్థుల ఖర్చులను రికార్డుల్లో నమోదు చే యాలని, రికార్డుల నిర్వహణ ఎన్నికలు ముగిసే వరకు కొ నసాగాలని ఆదేశించారు. పార్టీలకు చెందిన వారి ఖర్చు లను పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన రిజిస్టర్‌ లో, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు సంబంధిం చిన ఖర్చులను షాడో రిజిస్టర్‌లో నమో దు చేయాలన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలు 2బిలను రిటర్నింగ్‌ అధికారి కార్యాల యం వద్ద ఉచితంగా అందించాలని, ని యోజక వర్గానికి సంబంధించిన ఓటరు జాబితాలను అభ్యర్థులు పరిశీలించుకోవ డానికి వీలుగా పోలింగ్‌ కేంద్రం వారీగా జాబితాను అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా ఆనై ్లన్‌ ద్వారా కూడా పరిశీలించుకునే ఏర్పాట్లు చేయాలని ఆదే శించారు. నామినేషన్‌ పత్రాల నమోదులో అభ్యర్థులకు సిబ్బంది సహకరించి ప్రతీ కాలమ్‌ నమోదు చేసేలా చూడాలని, ఒకవేళ ఏదైనా కాలంలో పూరించాల్సింది ఏమి లేనప్పుడు లేదు/వర్తించదు అని ఖచ్చితంగా రాసేలా చూడాలని సూచించారు.
సెక్యూరిటీ డిపాజిట్‌ అనంతరం రిటర్నింగ్‌ అధికారి కి అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను సమర్పించినప్పుడు అనె గ్జర్‌-19, ఫార్మాట్‌-26 అఫిడవిట్‌, బ్యాంక్‌ ఖాతా, కుల ధ్రువీకరణ, ఫోటోలు, ఇతర నియోజకవర్గానికి చెందిన వారైతే వారి ఓటు వివరాలు తెలిపే సర్టిఫైడ్‌ కాపీ, అభ్యర్థి పోటిచేసే పార్టీ గుర్తులను తెలియజేశారా లేదా, మొదలైన వి క్షుణ్ణంగా పరిశీలించాలని, నామినేషన్‌ స్వీకరణ అ నంతరం స్క్రూటీనికి సంబందించిన సమయాన్ని అభ్య ర్థులకు తెలియజేయాలని అన్నారు.నామినేషన్‌ సమ ర్పిం చిన అనంతరం అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియ మా వళికి సంబంధించినవివరాలను
తెలియజేస్తూ క్యాండిడేట్‌ హ్యాండ్‌ బుక్‌ మొదలైనవి అందించాలని, నామినేషన్‌ తో పాటు అభ్యర్థి సమర్పించిన పత్రాల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ అనిస్‌ ఉర్‌ రషీద్‌, జిల్లా వ్యయ పరిశీలన నోడల్‌ అధికారి, జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, సహాయ వ్యయ పరిశీలనాధికారి మానసా, డిపిఆర్‌ ఓ ఆయుబ్‌ అలీ, తహశీల్దార్‌ ఇక్బాల్‌, నాగేశ్వర్‌ రావు తదిత రులు పాల్గొన్నారు.

Spread the love