ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న ట్రాక్టర్కు నిప్పు పెట్టుకున్న యజమాని..

నవతెలంగాణ -డిచ్ పల్లి

ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రాయన్ పల్లి ప్రాంతంలోని సామ్య నాయక్  తండా అటవీ ప్రాంతంలో అటవీ భూమిని చదును చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో చంద్రాయన్ పల్లి ఇన్చార్జి బీట్ అధికారి పవన్ కుమార్ తిరుమనపల్లి బీట్ అధికారి రాకేష్ తిరంగా పేట బీట్ అధికారి ప్రశాంత్ తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి చదును చేస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసి రేంజ్ కారణానికి తరలిస్తుండగా జాతరహాదరి 44 దేవి తాండ సమీపన ట్రాక్టర్ యజమాని బాదవత్ ధర్మ తన ట్రాక్టర్ డీజిల్ పైప్ లాగి నిప్పు పెట్టాడని సమీపన ఉన్న దేవి తండా వాసులు గమనించి బురద నీళ్లతో మంటలను ఆర్పినట్లు బీట్ అధికారులు తెలిపారు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రాయన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సామాన్య తాండకు కొద్ది దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ 468 గత నెలలో ప్రభుత్వం రెండు ఎకరాల 10 గుంటల పోడుభూమికి పట్టను అందజేసినట్లు వారు తెలిపారు ఆ భూమిలో చేయకుండా దాన్ని పక్కనే ఉన్న అటవీ భూమిని చదును చేస్తూ మల్లి చేస్తున్నాడనే విశ్వసనీయ  సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా ప్రభుత్వం పోడు పట్ట ఇచ్చిన భూమి కాకుండా అదనంగా అటవీ భూమిని చదును చేస్తున్నాడని దీంతో ట్రాక్టర్ను సీజ్ చేసి రేంజ్ కార్యాలయానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని దేవి తండా సమీపంలో  బదావత్ ధర్మ,తన కుమారుడితో కలిసి వచ్చి ట్రాక్టర్ ను అడ్డగించి ట్రాక్టర్కు ఉన్న డీజిల్ పైప్ ను గుంజేసి నిప్పు పెట్టాడని, దానిలో నుండి పోగా రావడం గమనించిన సమీపంలోనే ఉన్న దేవి తాండ వాసులు చేరుకొని పక్కనే ఉన్న బురద నీళ్లతో మంటలను ఆర్పినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇదే విషయమై ఇందల్ వాయి పోలీస్ స్టేషన్లో ఫారెస్ట్ అధికారుల వీధులకు అటంకపరచడం, అటవీ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా చదును, ట్రాక్టర్ను ను రేంజ్ కార్యాలయానికి తరలించాలనే దానిపై ఫిర్యాదు చేసినట్లు బీట్ అధికారి పవన్ కుమార్ తెలిపారు. ట్రాక్టర్ ను తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేసిన అది మొరాయించడంతో రహదారి వద్దనే వదిలివేయడం జరిగిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Spread the love