పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి

నవతెలంగాణ- తాడ్వాయి
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలనివామపక్ష విద్యార్థి సంఘాల పి డి యస్ యు, యస్ఎఫ్ ఐఏఐయాప్ డీయస్, ఏఐయస్ బిబివిల ఆధ్వర్యంలో మంగళవారం రోజున బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్ మాట్లాడుతూ విద్యారంగం సమస్యలు పరిష్కారం చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు దాంతో పాటు , పేద మధ్య తరగతి విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు నిర్వహించడం తీసుకురావాలన్నారు.టిఆర్టీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలి, ప్రభుత్వ పాఠశాలలో మూసివేతను నిర్ణయం మానుకోవాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది దాంతో పాటు 12 వ తేది నా జరిగే విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి విటల్, ఏఐఎఫ్ డిఎస్ జిల్లా కార్యదర్శి ఫయాజ్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆల్తాఫ్, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్ సరి చందు, జిల్లా నాయకులు సచిన్, నవీన్, బి వై ఎం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Spread the love