Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమనం నాటే మొక్క 
భవిష్యత్ తరాలకు మేలు

మనం నాటే మొక్క 
భవిష్యత్ తరాలకు మేలు

- Advertisement -


చేనేత వస్త్రాలు వినియోగించాలి : రవాణా,
 బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్

మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మార్కండేయ ఆలయంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ‘‘చేనేత వస్త్రాలు ప్రోత్సహిస్తామని, చేనేత వస్త్రాలు ధరిస్తామని’’ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతిథులకు శాలువాల కప్పే బదులు చేనేత కార్మికులు నేసే వస్త్రాలను వాడాలన్నారు. దీని వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు నేతన్నకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే చేనేత వస్త్రాలు ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గతంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేవారని, మా ప్రభుత్వం తరుపున ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ఉపాధి అవకాశాలు పెంచుతూ వారికి ఆర్థికంగా భరోసా ఇస్తున్నామన్నారు. ఆర్థిక పరమైన ఏ అంశాలు పెండింగ్‌లో లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. హుస్నాబాద్‌ను విద్య, వైద్యం, టూరిజం , ఇండస్ట్రియల్ కారిడార్ వంటి అన్ని రంగాల్లో అభివృధి చేస్తున్నామన్నారు. కోట్లాది మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రకృతి విపత్తులు, వర్షాలు అధికంగా పడడం, కరువు రావడం, వాతావరణ సమతుల్యత నశించి అనేక ఆంశాలపై ప్రకృతి ప్రభావం చూపుతుందన్నారు. అలా రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడంలో హుస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు. డిగ్రీ కళాశాలకు సీసీ రోడ్డు వేశామన్నారు. కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ ఏర్పాటు చేయిస్తానని, కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మెన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కౌన్సిలర్‌లు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ లింగమూర్తి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట రమణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -