అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీస్ కమిషనర్

నవతెలంగాణ- కంఠేశ్వర్:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేడు ఉదయము 9 గంటల ప్రాంతంలో టౌన్ 1,2,4 పోలీస్ స్టేషన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్  కల్మేశ్వర్ సింగనవర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ గురువారం నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ యందు పోలీసు సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఫ్లాగ్ మార్చు పాత కలెక్టరేట్ కార్యాలయం నుండి ప్రారంభమై ఎన్టీఆర్ చౌరస్తా, విజయ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట, ఎల్ఐసి ఆఫీస్, పూలాంగ్ చౌరస్తా, రాజ రాజేంద్ర చౌరస్తా, లక్ష్మీ మెడికల్, నెహ్రూ పార్క్ వరకు నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ యందు అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్లు ఎస్ జయ్ రామ్, గిరి రాజు, జితేందర్ నదావత్ ( అసిస్టెంట్ కమాండెంట్ ), నిజామాబాద్ ఏసిపి, సిఐలు, ఎస్ఐలు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు.
Spread the love