పోగొట్టుకున్న ఫోన్ తిరిగి బాధితునికి అప్పగించిన పొలీసులు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను వెతికి బాధితుడికి  అప్పగించినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈనెల 4వ తేదీన లక్ష్మణ్ తన ఫోన్ పోయినట్లు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన ఫోన్ ను గుర్తించి, బాధితుడికి బుధవారం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. పోగొట్టుకున్న పూర్ణ వ్యక్తిగా అప్పగించిన ఎస్ఐ రాజశేఖర్ కు బాధితుడు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love