
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మహా జాతరలో కొంతమంది వ్యక్తుల మొబైల్ ఫోన్లు కొద్దిరోజుల క్రితం చోరీకి గురయ్యాయి. దీంతో ఆ బాధ్యులు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకున్నారు. మండల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి ట్రేస్ అవుట్ చేసి చోరీకి గురైన సెల్ఫోన్లను ఛేదించారు. శనివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో నార్లపూర్ గ్రామపంచాయతీ ఎలుపాక గ్రామానికి చెందిన జజ్జరి రాకేష్, నల్లబెల్లి మండలం లెక్కలపల్లి గ్రామం ఎద్దు రామ్మూర్తి, కాటారం మండలం ఆవుల వెంకటేష్ అనే బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న మిగతా వారిని కూడా అతి త్వరలోనే దొరకబట్టి అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు బాధితులు పోలీసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.