పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ల ఎదుట ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి, నారాయణఖేడ్‌
పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 13 రోజుల నుంచి సమ్మె చేసున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగ ళవారం సంగారెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు, నారాయణఖేడ్‌లో సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్‌లను సహాయ కార్యద ర్శులుగా గుర్తించాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం పనులు చేస్తూ.. రాష్ట్రానికి అవార్డులు తెస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు, చట్టపరమైన సౌకర్యాలు అమలు కావడం లేదని వాపోయారు. వారిని వెంటనే పర్మి నెంట్‌ చేసి.. కనీస వేతనం రూ.19,000 ఇవ్వాలన్నారు. జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ విధానం రద్దు చేయాలన్నారు. ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఇన్సూరెన్స్‌ పథకాన్ని ఐదు లక్షలకు పెంచాలని.. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ప్రమాద బీమా, గ్రాట్యూటీ గుర్తింపు కార్డు లు ఇవ్వాలన్నారు. నెలనెలా రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించా లని.. ఏడాదికి మూడు జతల యూనిఫామ్స్‌, చెప్పులు, సబ్బులు, నూనెలు ఇతర అలవెన్స్లు ఇవ్వాలన్నారు. కార్మికు లపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమ స్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ సిబ్బంది గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన ట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ముఖ్య మంత్రిపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయా లని కోరారు. లేని యెడల సమ్మెను ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సంగారెడ్డిలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, గ్రామ పంచాయతీ కార్మికులు ఎంకన్న, సంజీవులు ఆనందం, నర్సింలు, బిక్షపతి, పాండు, నగేష్‌, నాగరాజు, సుదర్శన్‌, నారాయణఖేడ్‌లో సీఐటీయూ నాయకులు రమేష్‌, రాములు, పోచయ్య, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love