గొర్ల కాపరుల సమస్యలు పరిష్కరించాలి

నవతెలంగాణ-ధర్మసాగర్ : గొల్ల కాపర్ల సమస్యలు పరిష్కరించాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్ష  కార్యదర్శులు శాత బోయిన రమేష్,  కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని  సంగం మండల అధ్యక్షులు తొట్టె భీమన్న అధ్యక్షతన యాదవ కమ్యూనిటీ హాల్లో మేకల పెంపకం దారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు.అనంతరం జరిగిన సమావేశంలో రమేష్ లింగయ్యలు మాట్లాడుతూ తరతరాలుగా గొర్రెల, మేకల పెంపకం వృత్తి  పై ఆధారపడి జీవిస్తున్నారు.వీరిని అభివృద్ధి చేయకుండా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. సీజన్ వారీగా గొర్లు మేకలకు వస్తున్న రోగాలకు ప్రభుత్వం అన్ని రకాల మందులు పంపిణీ చేయాలని హెచ్చరించారు.జిల్లాలో ఉన్న పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. గ్రామగొఱ్ఱెలు,మేకల గొర్రె మేకల సహకార సంఘాలకు గుర్తింపు కార్డు తో సంబంధం లేకుండా గతంలో పశుసంవర్ధక శాఖ అధికారుల తో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేకల సాంబరాజు. సంఘం మండల *ఉపాధ్యక్షులు కాసాని పరుశురాములు. కార్యదర్శి మామిడి కుమార్ దాసరి చేరాలు గంటే సాంబరాజు,మాదం కుమార్,మండల బాబు శివులు,దాసరి కోటేశ్వర్, రాజయ్య,దాసరి కట్టయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love