వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

– డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
నవ తెలంగాణ- భువనగిరి రూరల్‌
వడ్లు కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యంను కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫైడ్‌ చేసి ఏ గ్రేడ్‌ ధాన్యంగా నమోదు చేసిన తర్వాత మిల్లర్లు బి గ్రేడ్‌ గా ఉందని అనడంతో రైతులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ధాన్యం ఏ గ్రేడు, బీ గ్రేడు ప్రమాణాలతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం ధాన్యం తరుగు పేరుతో రైతులను ప్రభుత్వం పూర్తింగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. తరుగు పేరుతో ధాన్యంను తొలగించడం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు కలెక్టర్‌ కార్యాలయంలో దుసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డకున్నారు. అనంతరం కలెక్టర్‌ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్నీ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కడుదుల నగేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిక్కుల వెంకటేశం, మజహార్‌, శివనంద్‌, అవైస్చిస్తే, కూర వెంకటేశ్‌, పాక మల్లేష్‌ యాదవ్‌, సత్తిరెడ్డి, బొల్ల శ్రీను, జంగయ్య యాదవ్‌, గడ్డమీది వీరస్వామి గౌడ్‌, శంకరా బాబు గౌడ్‌, కొండిలెడ్డి, నాగరాజు, నుచ్చు నాగయ్య యాదవ్‌, పాక వెంకటేష్‌ యాదవ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Spread the love