Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

- Advertisement -

‘ అపాయింటెడ్ డే’ ను వెంటనే ప్రకటించాలి : టీజేఎంయూ డిమాండ్‌
నవతెలంగాణ -హైదరాబాద్‌

‌ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనీ, అపాయింటెడ్‌ ‌తేదీని ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్‌ ‌చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరారు. ఆర్టీసీలో ఎన్నికలు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత నిర్వహిం చాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. అది చేస్తేనే ఉద్యోగులంతా సంతోషంగా ఉంటారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు అందరు కూడా అయోమయానికి గురవుతున్నారని గుర్తు చేశారు. ఈనెల 24వ తేదీన చేపడుతున్న నిరవధిక నిరాహారదీక్ష‍కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -