వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం ..
సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ..
నవతెలంగాణ – భువనగిరి : ఎందరో కమ్యూనిస్టుల త్యాగ ఫలితంగానే వచ్చిన ఫలాలు నేడు ప్రజలు అనుభవిస్తున్నారని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ తెలిపారు. ఆదివారం సీపీఐ(ఎం) మాజీ పట్టణ కార్యదర్శి కామ్రేడ్ కొలుపుల మల్లేశం 35 వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడ లో ఉన్న ఆయన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఆ పోరాటాల జండాలు నేటి యువత భుజాన మొయ్యాలని కోరారు. కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగానే విద్య వైద్యము, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు ప్రజలవంతకు వచ్చాయన్నారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సమాజాభివృద్ధి కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారని తెలిపారు. భువనగిరి పట్టణంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు ఏర్పాటులో ఆయన పాత్ర అమోఘమైనదన్నారు. కొలుపుల మల్లేశం మతము, కులము అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. అంటరానితనం వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. గార్లపాటి జగ్గయ్య నగర్ లో లోని స్థలంలో ఎర్రజెండాలు పాతి పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించారన్నారు. అతను అమరుడై 35 సంవత్సరాలు అవుతున్న నేటికీ ప్రజలలో ఆయన చిరస్మరణీయుడుగా నిలిచారన్నారు. ప్రజల అభివృద్ధి కోసం మనమంతా నిరంతరం పని చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి బర్ల వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు నాయకులు పడగెం కిషన్, వల్దాస్ అంజయ్య, ఆరే విజయ్, నరాల నరసింహ, తంబు వంశీ, అజయ్ సింగ్, బండి చందు పాల్గొన్నారు.
అమరుల త్యాగమే నేటి ఫలాలు..
- Advertisement -
- Advertisement -



