అమరుల త్యాగాలు మరువలేనివి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరుల త్యాగాలు మరువలేనివని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. గురువారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరులకు మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న, పాలకవర్గం ఘనంగా నివాళులు అర్పించారు. అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ సుంకే రజమల్లయ్య, వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత, కౌన్సిలర్ లు బోజు రమాదేవి రవీందర్, పేరుక భాగ్యరెడ్డి, వాళ్ల సుప్రజ, రవీందర్, కో ఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love