– బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం 25 వేల అందజేసిన ఇమ్మడి గోపి
నవతెలంగాణ- డిచ్ పల్లి.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి కొండంత అండగా ఉండటానికి తనవంతుగా 25 వేల రూపాయలను బాధిత కుటుంబానికి సోమవారం రాత్రి ఇందల్ వాయి మండలంలోని చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన కుపిర్యాల అనిల్ కుటుంబానికి అందజేసి ఉదారత ను చాటుకున్నారు. దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి. గత నాల్గు రోజుల క్రితం తన అక్క వద్దకు వెళ్లి తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా రాంపూర్ డి గ్రామ శివారులోని విశ్వా ఆగ్రో టేక్ వద్ద లారి డీ కోని చంద్రయాన్ పల్లి గ్రామానికి చెందిన కుపిర్యాల అనిల్ అక్కడి కక్కేడే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి బాధ్యత కుటుంబానికి ఆసరాగా నిలవడానికి తన వంతుగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితున్ని కుటుంబాన్ని అందజేసి వారిని పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అనిల్ అందరితో కలిసిమిలిసి ఉండేవాడని తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడిందని కుటుంబ సభ్యులు రోధిస్తూ ఇమ్మడి గోపికి వివరించారు. ఇదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా అవసరం పడ్డప్పుడు. తనను సంప్రదించాలని తన వంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటానని ఇమ్మడి గోపి బాధ్యత కుటుంబానికి భరోసా కల్పించారు. మృతి చెంది నాలుగు రోజులు గడవకముందే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం పట్ల కుటుంబ సభ్యులు,బంధువులు, ముదిరాజ్ కుల సంఘాల నాయకులు ఇమ్మడి గోపి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.