నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. నగర శివారులోని నవ్య భారతి గ్లోబల్ స్కూలుకు సంబంధించిన బస్సు స్కూల్ అయిపోగానే పిల్లల్ని దింపేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో గంగస్థాన్ ఫేస్ రెండు వద్దకు రాగానే బురదలో బస్సు దిగింది. బస్సు ఒకవైపు వంగిపోగా డ్రైవర్ అప్రమత్తమై బస్సులో అక్కడికక్కడే ఆపివేశారు. బస్సులో ఉన్నటువంటి విద్యార్థులను సురక్షితంగా క్రిందికి దించి ఇతర వాహనాలలో విద్యార్థులను పంపించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మార్గంలో రోడ్డు సరిగా లేరందువలనే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలతో పాటు పాఠశాలల డ్రైవర్లు కూడా చెబుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లాలోని ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.