మహా జాతరలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

నవతెలంగాణ -తాడ్వాయి 
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ సమక్క సారక్క మేడారం జాతర మూడు రోజులపాటు సాగే దీనిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మారువలేనివి. వివిధ రాష్ట్రాల నుండి లక్షలో తరలివస్తున్నా భక్తులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ,  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి డా.ధనసరి అనసూయ గారి ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శ్రీమతి అనిత రమచంద్రన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ  జిల్లాలోని డిపీఓ, డిఎల్ఆర్ఓ, ఆధికారులు మేడారం లో పది క్యాంపు కార్యాలయలుగా ఏర్పడి  ములుగు, వరంగల్ మహబూబాబాద్, జగిత్యాల, నల్గొండ, మంచిర్యాల, వివిధ  జిల్లాలఇంచార్జి ఆధికారులు   సమారు 5000మంది కార్మికులతో జాతర పరిసర ప్రాంతాల్లో చెత్తను తీయడం, బ్లీచింగ్ పౌడర్, భక్తులు వెళ్లె దారులో శానిటైజ్, వివిధ రకాల పారిశుద్ధ్య పనులను పది క్యాంపులుగా ఏర్పడి పనులను పూర్తి చేస్తున్నాట్లు  టెంపుల్ క్యాంపు లేబర్ ఇంచార్జి ప్రభాకర్ తెలిపారు.
Spread the love