ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

నవతెలంగాణ-ఆర్మూర్  : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతున్నది. ప్రధానంగా సంక్షేమ వసతిగృహలు, గురుకుల, కెజిబివి, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార నీ ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దాల నాగరాజు అన్నారు ..ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసినారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచామని ప్రకటించిన అవి అమలు కావడం లేదు, గత సంవత్సరకాలం నుంచి హస్టల్స్ మెస్ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి.గత నాలుగేళ్ల నుండి సుమారు 5,177 కోట్లు రూపాయల స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయలేదు. హస్టల్స్ విద్యార్ధులకు కాస్మోటిక్ ఛార్జీలు ఉసేలేదు. అందుకే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాము. పేద విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరుతున్నాము. నియోజకవర్గంలోని నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో బాయ్స్ హాస్టల్ నిర్మించాలని . ఆర్మూర్ లో ST. గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని
 పట్టణంలో ఉన్న కేజీబీవీ డ్రైనేజ్  సమస్య పరిష్కరించి  ప్రహరీ గోడ నిర్మించాలని,పెండింగ్ లో ఉన్న 5,177 కోట్ల స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాల,ప్రభుత్వం ప్రకటించిన పెంచిన మెస్ ఛార్జీలు తక్షణమే అమలు చేయాల నీ,, పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి ఇవ్వాల నీ, రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు, కెజిబివి, సంక్షేమ* *వసతిగృహాలకు స్వంత భవనాలు నిర్మించాల నీ గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్న హస్టల్స్ మెస్ బిల్లులు,కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలి, దుప్పట్లు, యూనిఫామ్స్, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించాల నీ రీపేర్లలో ఉన్న బాత్రూమ్, మరుగుదొడ్లు, కరెంటు మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాల నీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జవహర్ సింగ్ పాల్గొన్నారు.
Spread the love