పసిడి వర్ణంలో ఆకాశం

నవతెలంగాణ-రాయపర్తి : లోకానికి వెలుగు పంచే సూర్యుడు తొలి సంధ్య వేళ పంట పచ్చని పైరుకు సవరించుకుంటుండగా.. పువ్వుల ఒళ్ళు ఇర్పుల వలె… నీటి పనుపుపై సింగిడి ప్రతిబింబిస్తుండగా.. పొద్దు తిరుగుడు ఎదురుచూపు కోసం భూవికి చేరిన కిరణాలు.. మలి సంధ్య వేళ ఈ చోట జీవకోటిని నిద్రపుచ్చి మరోచోట వెలుగు పంచడానికి కిరణాలు పయనమైన సమయాన నీలి వర్ణంలో ఉండే ఆకాశాన్ని పసిడి వర్ణంలోకి మార్చి చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి.. ఈ సరైన సమయాన స్థానిక యువకుడు గారె విష్ణు ఈ దృశ్యాన్ని అతని సెల్ ఫోన్ కెమెరాలో బంధించాడు.. దాంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది..
Spread the love