ముత్యందార జలపాతంలో చిక్కుకున్న 40 మంది

నవతెలంగాణ- వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం ముత్యం దార జలపాతం కు వెళ్లి 40 సందర్శకులు అడవిలో చిక్కుకు పోయారు. మండల పరిధిలోని వాజేడు మండలం లోని బొగత జలపాతాన్ని వర్షాలు కురుస్తున్న సందర్బంగా అటవీశాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జలాపాతనికి వచ్చిన కొందరు సందర్శకులు అనుమతులు లేని ముత్యందార  జలపాతం వద్దకు వెళ్లారు.ఉదయం వెళ్లిన తరువాత ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి .దాంతో వెళ్లిన సందర్శకులు ముత్యందా రా సమీపంలో చిక్కుకున్నారు.చిక్కుకున్న వారు 100 కు డైల్ చేసి చిప్పినట్లు సమాచారం. బొగత జలపాతం తాత్కాలికంగా మూసివేసి అటవీశాఖ అధికారులు ప్రమాద కరమైన ముత్యం దార  జలాపాతనికి సందర్శకులు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం లో వైపల్యం చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సందర్శకులు ముత్యం ధర జలాపాతనికి వెళ్లారు.
Spread the love