స్మార్ట్ కపుల్ మ్యాట్రెస్ ని లాంచ్ చేసిన ద స్లీప్ కంపెనీ

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో స్లీప్ టెక్ మూవ్ మెంట్ కు కారణమైన ప్రముఖ బ్రాండ్ ద స్లీప్ కంపెనీ. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఉత్పత్తులతో వినియోగదారుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న స్లీప్ కంపెనీ ఇప్పుడు తాజాగా స్మార్ట్ కపుల్ మ్యాట్రెసెస్ ని మార్కెట్ లో లాంచ్ చేసింది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డీ2సీ కంపెనీగా పేరుతెచ్చుకున్న ద స్లీప్ కంపెనీ… వినూత్నమైన మరియు విప్లవాత్మకమైన ఉత్పత్తులతో అందరికంటే ముందు వరుసలో ఉంది. ఈసారి కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో స్మార్ట్ కపుల్ మ్యాట్రెసెస్ ని రూపొందించింది. ఏ ఇద్దరి నిద్ర ఒకేలా ఉండదు. అదే సమయంలో దంపతులది కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విభిన్నమైన నిద్రపోయే పద్ధతి ఉంటుంది. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని డ్యూయల్ అడాప్టివ్ సపోర్ట్ తో స్మార్ట్ కపుల్ మ్యాట్రెస్ లాంటి అద్భుతమైన పరిష్కారాన్ని అందించింది. దంపతులు పరుపును తిప్పాల్సిన అవసరం లేకుండా మృదువైన మరియు దృఢమైన సౌకర్యాలను సులభంగా ఎంచుకోవచ్చు. గతంలో పరుపులు అన్నీ ఒకేలా, ఒకే మెటీరియల్ తో తయారు చేసేవారు. అయితే అందరికి అవి నచ్చాలని లేదు. ఒక్కొక్కరి నిద్ర ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి తమ పరుపు మెత్తగా ఉండాలని అనుకుంటారు. ఇంకొంతమంది గట్టిగా ఉండాలని కోరుకుంటారు. ఇక దంపతులుది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిరుచి. దీంతో.. చాలా జంటలు సరైన నిద్రలేక ఇబ్బందులు పడుతుంటాయి. దంపతులతో పాటు చాలామంది వినియోగదారులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే విషయాన్ని ద స్లీప్ కంపెనీ గుర్తించింది. దాదాపు 25-30% మంది వ్యక్తులు ఇలాంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలుసుకుంది. దీనికి పరిష్కారంగా ద స్లీప్ కంపెనీ తెలివిగా స్మార్ట్ కపుల్ మ్యాట్రెస్‌ను అభివృద్ధి చేసింది. వారి పేటెంట్ అయినటుంవంటి స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో లక్స్ మరియు ఆర్థో రేంజ్‌లను కలపడం ద్వారా విభిన్నమైన మ్యాట్రెస్ ని రూపొందించింది. ఈ వినూత్న మ్యాట్రెస్ మోషన్ ఐసోలేషన్ మరియు బాడీసెన్స్ అడాప్టబిలిటీ వంటి కొత్త లక్షణాలను పరిచయం చేస్తుంది. తద్వారా వినియోగదారులకు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా ది స్లీప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… “ద స్లీప్ కంపెనీలో మేము విభిన్నంగా ఆలోచించి చేసే ప్రతి ఆవిష్కరణ వినియోగదారుల అవసరాల నుంచి పుట్టింది. ఒక బ్రాండ్‌గా మేము వినియోగదారుల అభిరుచులను నిరంతరం తనిఖీ చేస్తూనే ఉంటాం. వారి అభివృద్ధి చెందుతున్న అవసరాలను ముందుగానే ఊహించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాము. నిద్ర ప్రాధాన్యతలలో తేడాల కారణంగా నిద్రపోయేందుకు ఇబ్బందులు పడుతున్న దంపతులు ఉన్నారని మేం గుర్తించాం. మా ఈ స్మార్ట్ కపుల్ మ్యాట్రెస్ ను అలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూపొందించాం. ప్రపంచవ్యాప్తంగా నిద్ర లేమితో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు మెరుగైన మరియు ప్రశాంతమైన నిద్రను అందించే మ్యాట్రెస్ ఉత్పత్తుల రూపకల్పనను కొనసాగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు. స్లీప్ కంపెనీ విభిన్నమైన ఉత్పత్తులు మరియు వారందించే ఆఫర్‌లు వారి వెబ్‌సైట్‌తో పాటు ముంబయి, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చిలోని రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాదిలో 100కి పైగా స్టోర్‌లను అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది ద స్లీప్ కంపెనీ. అంతేకాకుండా అదనపు సీటింగ్, స్లీపింగ్ సొల్యూషన్‌లతో ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. స్లీప్ కంపెనీ ఈ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేస్తూనే ఉంది. ఈ విభాగంలో సరికొత్త ఆవిష్కరణలతో పాటు సాంకేతికతలోనూ అగ్రగామిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. స్మార్ట్ కపుల్ మ్యాట్రెస్‌ను పరిచయం చేయడంతో పాటు కంఫర్ట్ మరియు కస్టమైజేషన్ విభాగంలో సరికొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తోంది. తద్వారా జంటలు నాణ్యమైన మరియు ప్రశాంతమైన నిద్రను పొందగలరని భరోసా ఇస్తోంది.

Spread the love