స్పీకర్ ఆదేశించారు… అధికారులు సర్వే చేశారు

– కొచ్చేరి మైషమ్మ ఆలయం నిధులు మంజూరు
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
కొచ్చేరీ మైషమ్మ ఆలయ భూముల వివరాలను సేకరించి లేఅవుట్ చెయ్యాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  బుధవారం ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు నేడు నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కొచ్చేరీ మైషమ్మ దేవాలయం కు చెందిన భూములను సర్వే చేశారు. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఆలయ భూముల వివరాలు ప్రకటించడంతో పాటు ఆలయ భూములను సర్వే చేయించి హద్దురాళ్లు, ఆలయంలోకి వెళ్లేందుకు దారులు ఉండేలా చూడాలని అధికాటులని  గ్రామస్థులు కోరారు.  కొచ్చేరు మైసమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి, దీనిని దృష్టిలో ఉంచుకొని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ. 1.35 కోట్లతో మెయిన్ రోడ్డు నుండి లింగంపల్లి తాండా వరకు తారు రోడ్డు మరియు ఆలయం వద్ద రూ. 40 లక్షలతో సిసి రోడ్లు వేయడానికి నిధులు మంజూరు అయ్యాయి. వసతి గృహాల నిర్మాణానికి  స్థలాన్ని పరిశీలించారు. రూ. 1.50 కోట్లతో వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ తెలిపారు వీరి వెంట రెవెన్యూ ఆర్ ఐ హనుమాన్లు , అనిల్ సర్వేర్ గ్రామ సర్పంచ్ యశోద మహేందర్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
Spread the love