ధ్వంసమైన యూనివర్సిటీ లను రాష్ట్ర ప్రభుత్వం పునర్ నిర్మించాలి

– ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి..
– రాజకీయ జోక్యం లేకుండా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించాలి..
– వక్త ప్రొఫెసర్ పున్నయ్య..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్రంలో ధ్వంసమైన యూనివర్సిటీ లను రాష్ట్ర ప్రభుత్వం పునర్ నిర్మించాలని,ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యాశాఖకు ఓక మంత్రిని కేటాయించాలని, రాజకీయ జోక్యం లేకుండా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించే విదంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. అదివారం తెలంగాణ యూనివర్సిటీ లో రెండవ రోజు తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య తో వర్తమాన రాజకీయాలు ఉన్నత విద్య రంగంలో సవాళ్లు అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని పరిరక్షించే విదంగా చర్యలు చేపట్టాలని వారన్నారు. అదేవిధంగా ప్రతి యూనివర్సిటీలో మౌలిక సౌకర్యాలని మెరుగుపరచాలని, యూనివర్సిటీ ల అభివృద్ధి కోసం ఐదు వేల కోట్ల నిధులను కేటాయించాలన్నారు. ప్రతి పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించడంలో విఫలమయ్యాయని, ఇప్పటికైన ప్రతి పరిశోధక విద్యార్థికి ఫెలోషిప్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకోవచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రద్దుకు తీర్మానం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనీ ప్రైవేటు యూనివర్సిటీలలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కన్వెన్షన్ లో 26 మందితో కన్వీనింగ్ కమిటీ ని ఎన్నుకున్నారు. యూనివర్సిటీల కన్వీనర్ గా ఉస్మానియా యూనివర్సిటీ నాయకురాలు మమత కన్వీనర్ గా ఎన్నికయ్యారు.  కో- కన్వీనర్లుగా ప్రసాద్, ఆంజనేయులు, పవిత్ర, లను ఎన్నుకున్నారు. అంతర్జాతీయ గీతంతో కన్వెన్షన్ ముగింపు పలికారు. ఈసమావేశంలో 12 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సూరి, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి  మమత, ఎస్ఎఫ్ఐ  నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, రాష్ట్ర కమిటీ సభ్యులు భరత్, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి రవి నాయక్, తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంధ్య రెడ్డి, దీపిక, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, నాగరాజు, బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ యూనివర్సిటీ నాయకులు దినేష్, చిత్రు, పవన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love