నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు సత్తా చాటాయి. 98 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 126 పాఠశాలలకు 100 ఫలితాలు వచ్చాయి. 197 పాఠశాలలు 500 మార్కులకు పైగా సగటు మార్కులు, 45 పాఠశాలలు 570 మార్కులకు పైగా సగటు మార్కులు సాధించాయి. మొత్తం 204 పాఠశాలల్లో 126 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, అకాడమిక్ బృందాల కృషికి నిదర్శనమని మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, టీజీఎంఆర్‌ఈఐఎస్ చైర్మెన్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
టాప్ 10 అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు:
- జి. మౌన్య శ్రీ – కుత్బుల్లాపూర్ – 591 మార్కులు
- మొహమ్మద్ రెహాన్ – సికింద్రాబాద్ కాంట్ – 589 మార్కులు
- ఎం. పూజిత్ – సంగారెడ్డి – 589 మార్కులు
- మొహమ్మద్ రెహాన్ – సంగారెడ్డి – 587 మార్కులు
- పఠాన్ రేహానా – కోదాడ్ – 585 మార్కులు
- డి. అనాస్ అలీ – సంగారెడ్డి – 584 మార్కులు
- సింగం శ్రీజ – హయత్‌నగర్ – 584 మార్కులు
- మొహమ్మద్ ఉమ్మయ్య తరన్నుమ్ – ధర్మపురి – 583 మార్కులు
- మైమూనా మదీహా – మక్తల్ – 583 మార్కులు
- టి.తరుణ్ కుమార్ – పటాన్‌చెరు – 583 మార్కులు



