Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థుల సత్తా

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోని ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2026లో బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ 330 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. మహిళల విభాగంలో ఆరోహి దేశ్‌పాండే 280 మార్కులతో టాపర్‌గా నిలిచింది. తెలుగు విద్యార్థులు ఇద్దరు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. 318 మార్కులతో కుచి సందీప్ ఆలిండియా 5వ ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, 312 మార్కులతో మెడిశెట్టి నాగ సహర్ష 9వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. నేటి (మంగళవారం-జూన్2) నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దేశీయ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ ఆదివారం అర్ధరాత్రి విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం నేడు (జూన్ 1) ఉదయం 10 గంటలకు ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఫలితాలను ముందుగానే ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026లో బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకుగాను 330 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కేథరిన్ డేర్ ఆల్ ఇండియా 2వ ర్యాంక్‌ను సాధించగా, జతిన్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నానికి చెందిన కుచి సందీప్ ఆల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026కు 1,87,389 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,79,694 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 56,880 మంది అర్హత సాధించగా అందులో 10,107 మంది బాలికలు, 46,773 మంది బాలురున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారు దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల కోసం పోటీపడనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 23 ఐఐటీల్లో 18,160 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉండగా ఈ ఏడాది అదనంగా మరో 300 సీట్లు పెరిగే అవకాశమున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -