మండలంలోని బోడంగి పర్తి గ్రామపంచాయతీలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కులగణన సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి సర్వేను సోమవారం పరిశీలించారు. ఈ సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇంటి యాజమానుల నుండి వాస్తవమైన సమాచారము సర్వే ఫారంలో ఉన్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా అన్ని వివరాలు జాగ్రత్తగా సేకరించి తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎనిమరేటర్లకు సూచించినట్లు తెలిపారు. బోడంగి పర్తి గ్రామంలో గ్రామ ప్రజలకు సర్వే యొక్క ఉద్దేశం ,సర్వే ఆవశ్యకత, సర్వే వల్ల వచ్చేటువంటి భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు, పథకాల గురించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సర్వే కీలకంగా మారుతుందని, ప్రజలందరూ కూడా ఎలాంటి అపోహలు, అనుమానాలు, తావు లేకుండా సర్వేకు సహకరించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వే సిబ్బంది పాల్గొన్నారు.