ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్ అక్రమం

– వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: డిటిఎఫ్ నాయకుల డిమాండ్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్ అక్రమం అని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డి.టి.ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య ప్రధాన కార్యదర్శి రాజన్న లు మాట్లాడుతూ..మోపాల్ మండలం పిఎస్ బోర్గాం (పి) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి సస్పెన్షన్ అక్రమం, కావున జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి ఆమె అక్రమ సస్పెన్షన్ను తొలగించి విధులలోకి తీసుకోవాల్సిందిగా డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.                  మధ్యాహ్న భోజనం కలుషితానికి బాధ్యులను చేస్తూ ఈనెల 8న ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఈనెల 7న జరిగిన సంఘటనలో పాఠశాల నిర్వహణలో సదరు ప్రధానోపాధ్యాయురాలు లేదు, టిసి మీటింగు ఉన్నందున సహోపాధ్యాయునికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చి కాంప్లెక్స్ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ బోర్గాం( పి) వెళ్లడం జరిగింది. అదే రోజు జరిగిన విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులను చేస్తూ మండల విద్యాశాఖ అధికారి నివేదిక ను పేర్కొంటూ ఆమెను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేయడం జరిగింది. కావున విధినిర్వహణలో లేని ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్  సరైనది కాదు,  ఆమెను విధులలోకి  తీసుకోవాల్సిందిగా,  డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Spread the love