కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

– కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించాలి.
– 4 లేబర్ కోడ్లను రద్దుకై ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేద్దాం
నవతెలంగాణ కంటేశ్వర్: కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనము 26 వేల రూపాయలు నిర్ణయించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దుకై ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ లో మున్సిపల్ జోన్ వన్, జూన్ ఫోర్ బి లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కై పోస్టర్ ఆవిష్కరణ జోన్ వన్ జోన్ ఫోర్ బి లో సంతకాల సేకరణ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు లు మాట్లాడుతూ.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై  ప్రకటిస్తూ, లక్షలాది కుటుంబాల ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలని అందులో భాగంగా 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నిర్ణయించాయి పద్ధతులలో కార్మికుల్ని నియమిస్తే వారికి పీఏపీఎస్ఐ కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ ఈ సమ్మెలో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలలో పనిచేస్తున్న పర్మినెంట్ మరియు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొనాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) కమిటీ పిలుపునిస్తున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారానికొచ్చి 10 ఏండ్లు పూర్తైనా రైతాంగ, కార్మికవర్గ, ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. అనేక మోసపూరిత నినాదాలతో కాలం వెళ్ళదీసింది.
బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ అమలుకే నోచుకోలేదు. నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. కనీస వేతనం రూ.26,000/-లు నిర్ణయించకపోవడంతో మున్సిపల్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతులలో కార్మికుల్ని నియమిస్తే వారికి పీఏపీఎస్సై కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తాయని ఆలోచనలో నర్సరీలు పార్కులు ట్యాంకు బండ్స్ వైకుంఠధామం హౌస్ కీపింగ్ ఇతరుల డైలీ వైస్ కార్మికుల్ని నియమిస్తూ వారికి అన్యాయం చేస్తున్నది. ఇవి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలలో భాగమే ఈ సవర్ణాలకు వ్యతిరేకంగా మున్సిపాలి ఉద్యోగులు కార్మికులంతా 2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూపతి, చంద్ర సింహం, సంతోషింగ్, అంజయ్య, చంద్రయ్య, శేఖర్, జి లక్ష్మి, కే లక్ష్మి, అవినాష్, ఏక్ నాథ్ గుండాస్వామి ఆశా బాయ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love