నిందితుడిని కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా, కల్లం పాడులో లైంగిక దాడికి గురైన మైనర్ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘాతుకానికి పాల్పడిన నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అతి కిరాతకంగా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు. తీవ్రమైన గాయాలతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు, తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం బాధిత బాలికకు మెరుగైన వైద్యమందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



