రౌండ్ టేబుల్ సమావేశంలో
విద్యావేత్తలు, మేధావులు
నవతెలంగాణ -మహబూబ్ నగర్
పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించాక మొట్టమొదటిసారి వచ్చిన అవకాశంలో భాగంగా విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలని విద్యావేత్తలు, మేధావులు కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ మీటింగ్ హాలులో మంగళవారం పాలమూరు పునర్నిర్మాణ ఫోరం నిర్వాహకులు హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, మేధావులు మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే విద్యారంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న జిల్లాలో పాలమూరు విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో మరింత గుర్తింపు రావాలంటే జాతీయ సదస్సును ఇక్కడే నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జి.శ్రీనివాసులు ఏకపక్ష నిర్ణయంతో ఎక్కడో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రయివేట్ కన్వెన్షన్ హాల్‌లో జాతీయ సదస్సు నిర్వహించడమంటే జిల్లాను అవమానపరచడమే అవుతుందన్నారు. ఆయన వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి నిర్ణయంలోనూ యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జాతీయస్థాయిలో అనుమతులు వచ్చినప్పటి నుంచి విద్యార్థి సంఘాల నేతలు, పట్టణ ప్రముఖులు చాలాసార్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ వీసీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన ఏకపక్ష అభిప్రాయాన్ని మార్చుకొని ఈ సదస్సును యూనివర్సిటీలోనే నిర్వహించాలని కోరారు. ఏర్పాట్లకు మా వంతు సహకారం అందిస్తామని పట్టణంలోని వివిధ కళాశాలల యజమానులు హామీనిచ్చారు. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జహీర్ అక్సర్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, బీజేపీ మాజీ అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జయప్రకాశ్ నారాయణ, ఇంజినీరింగ్ కళాశాల చైర్మెన్ రవి కుమార్, వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
సదస్సు రెండ్రోజులు నిర్వహించాలి : ఐక్యవిద్యార్థి సంఘాల డిమాండ్
పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సదస్సును నిర్వహిం చాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. జాతీయ సదస్సును కన్హా శాంతి వనంలో కాకుండా పాలమూరు యూనివర్సిటీలోనే రెండ్రోజులు నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సంధ్య కార్తీక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సుధాకర్, పాలమూరు యూనివర్సిటీ జాక్ కన్వీనర్ సాయి అభినయ, ఎస్‌ఎఫ్‌ఐ పీయూ అధ్యక్షులు రాజేష్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు మారుతి, టీఆర్‌ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు భరత్, ఎమ్మెస్‌ఎఫ్ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు శేఖర్, స్వేరో స్టూడెంట్ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు పవన్, బిఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంజిత్, పాలమూరు యూనివర్సిటీ బీసీ సంఘం అధ్యక్షులు రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సును పీయూలోనే నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



