– వందశాతం ప్యూరిఫైయర్ ఓటరు లిస్ట్ కావాలి అదనపు కలెక్టర్ వీరారెడ్డి
నవతెలంగాణ-సంగారెడ్డి
తప్పులు లేని పారదర్శకంగా ఉండే ఓటరు జాబితాను రూపొందించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమా వేశ మందిరంలో నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్స్‌కు బీఎల్‌ఓ, బీఎల్‌వో సూపర్వైజర్ల సామర్థ్యాల పెంపు, ఓటరు జాబితా రూపకల్పన, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, విధు లు, బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణ నిచ్చారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ.. వందశాతం ప్యూరిఫై యర్ ఓటర్ లిస్ట్ సిద్ధం చేయాలన్నారు. అర్హులందరూ ఓటరు జాబితాలో తప్పనిసరిగా ఉండాలన్నారు. ఒక ఇంట్లో ఓటు హక్కు గల కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ బూత్‌లో ఉండాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లు దాటితే రెండో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాను ప్రతి మూడు నెలలకు ఒకమారు అప్డేట్ చేయాలన్నారు. బీఎల్‌ఓలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, తుది ఓటరు జాబితా, సమ్మరీ రివిజన్ తదితర విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. బిఎల్‌ఓలను ఈఆర్‌ఓ నియమిస్తారన్నారు. బీఎల్‌వో తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించినప్పుడే, ఆరోగ్య కరమైన ఓటరు జాబితా రూపొందుతుందని, ఓటర్లు స్వేచ్ఛ గా ఓటు హక్కు వినియోగించు కుంటారని పేర్కొన ా్నరు. అన్ని పొలిటికల్ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నిj ుమించుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లు రేపటి నుండి రెండు రోజులపాటు అన్ని మండలాలలోని బీఎల్‌వోలు, బీఎల్‌వో సూపర్వైజర్లకు శిక్షణను ఇస్తారన్నారు. అనంతరం జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లు నారాయణఖేడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కష్ణ కుమార్, జహీరాబాద్ ఆర్డిఓ వెంకారెడ్డి నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్లకు సమగ్ర శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నగేష్, రెవిన్యూ డివిజనల్ అధికారులు రవీందర్ రెడ్డి,అందోల్ – జోగిపేట ఆర్డిఓ పాండు, నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.