ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రపంచం హైదరాబాద్ వైపుచూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఈమేరకు ఎక్స్ వేదికలో సీఎం పేర్కొన్నారు. కేవలం పెట్టుబడులు, వ్యాపారం కోసమే కాదు… ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞానం, నైపుణ్యాలు, ప్రతిభ, ఆవిష్కరణలు, ఆలోచనల కోసమని అభిప్రాయపడ్డారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఎగ్జిక్యూటివ్ విద్య, పరిశోధన, ప్రపంచ నైపుణ్యాలు, పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారం వంటి రంగాలలో భాగస్వామ్యాలను మరింత పటిష్టం చేసుకునేందుకు, తాను యూకేలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల ప్రతినిధి బృందంతో సమావేశమైన విషయాన్ని ప్రస్తావించారు. డిసెంబర్ నుంచి హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అదే సమయంలో ఎంఐటీ, పర్డ్యూ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, వర్జీనియా టెక్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలతో కూడా సహకారాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌ఫ్యూచర్‌సిటీ ఈ దార్శనికతను మరింత ముందుకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భవిష్యత్తుకు అవసరమైన ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రపంచ స్థాయి కంపెనీలు, అత్యాధునిక పరిశోధన ఒకచోట అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమే నేర్చుకునేలా, ఆవిష్కరణలు చేసేలా, పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశంగా మార్చుతామని పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు…2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



