
– కంటేశ్వర్ కు చెందిన రవీందర్ గా గుర్తింపు గతంలోనూ హోర్డింగ్ పైకెక్కిన యువకుడు
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద గల హోర్డింగ్ పైకెక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. స్థానికంగా ఉండే రవీందర్ అనే వ్యక్తి గా స్థానికులు గుర్తించి సంబంధిత పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న టౌన్ సిఐ నరహరి, మూడవ టౌన్ సిబ్బంది యువడికుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కిందకు దింపారు. ఓ వ్యక్తి తనకు వెయ్యి రూపాయలు ఇచ్చేదని, ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు రవీందర్ తెలిపారు. సదరు యువకుడు పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో హోర్డింగ్ పైకి ఎక్కి నిద్ర పోయాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఉదయం కూడా హోర్డింగ్ పైకి ఎక్కే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారని చెబుతున్నారు. గతంలో సైతం రెండు, మార్లు ఇలాగే చేశాడని స్థానికులు చెప్పుకొచ్చారు. అనంతరం టౌన్ సిఐ నరహరి, రవీందర్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సుమారు అరగంట పాటు యువకుడు హల్చల్ చేయడంతో వెంటనే స్పందించిన పట్టణ సిఐ నరహరి సమయస్ఫూర్తితో కిందికి దింపినారు.