
సందర్భంగా రాజా గౌడ్ (పి ఈ టి )జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గారు అజ్మీరా రాజా, బదవత్ యశ్వంత్, ఉప్పులపు నితిన్, కొట్టం రాజ శేఖర్ లను కేశ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు మైదం మహేశ్వర్, ఉపసర్పంచ్ మోత్కూరి భాస్కర్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు మున్నూరు. గంగాధర్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కానిస్టేబుల్ గా ఎంపికైన యువకుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు పి.ఈ.టి రాజా గౌడ్, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్, ఎంపీటీసీ కానిస్టేబుల్ గా ఎంపికైన యువకులను అభినందించి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మన ఊరి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.