వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది

–  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ మహేష్, 45 మందికి వైద్య పరీక్షలు,
నవతెలంగాణ -తల్లాడ
తల్లాడ మండలం వెంకన్నపేట గ్రామంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించి 45 మందికి వైద్య సేవలు అందించినట్లు డాక్టర్ మహేష్ తెలిపారు. డాక్టర్ మహేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కాల్వలలో గృహపరి సరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వినియోగించని సామాన్లు పాత టైర్లు, సీసాలు, రోలు, కొబ్బరి బొండాలు పూలకుండేలు, కూలర్లు, తదితర వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు, ప్రతి శుక్ర వా రం డ్రైడే ని పాటించాలన్నారు, కాచి చల్లార్చ నీటిని తాగాలని, దోమ లు కు ట్టకుండా దోమతెరలు వాడాలని కోరారు, మురికి నీటి వలన అతిసారం టైఫాయిడ్ కామెర్లు మొదలైన అంటువ్యాధులు వస్తాయని, నిల్వ పదార్థాలు సేవించవద్దని, మాంసాహారం నిల్వ ఉంచి వాడకూడదన్నారు, వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలని, ఎవరికైనా జ్వరం ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి అన్నారు, 58 రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో సిహెచ్ ఓ భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ కే పెద్ద పుల్లయ్య, కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎన్ఎం శిరీష, శ్రావణి ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love