రేషన్‌ కార్డులకు ఈ కేవైసీ

– వేలిముద్రలు వేసిన వారికే బియ్యం
– చనిపోయిన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రణాళిక
– గల్ఫ్‌కు వెళ్లిన కార్మికుల రేషన్‌ కోట ఆగేనా?
నవతెలంగాణ-వెల్గటూర్‌
రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధమవుతోంది. రేషన్‌ దుకాణాల్లో ఈ నెల నుంచి కార్డుల పరిశీలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్డు లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయాలని ఇప్పటికే సంబంధిత డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. ఈక్ర మంలో అర్హులను గుర్తించి, అనర్హుల పేర్లను తొల గించడం ద్వారా కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయవచ్చని పౌరసరపర శాఖ భావిస్తోంది.
వేలిముద్రలు అందరూ వేయాల్సిందే..!
కుటుంబ యజమానితోపాటు కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేసుకోవాల్సిందే. అందుకు రేషన్‌ షాపుకు వెళ్లి ఈపాస్‌ యంత్రాల సాయంతో కేవైసీ పునరుద్ధరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబ సభ్యులంతా వేలిముద్ర వేయగానే రేషన్‌ కార్డు నెంబర్‌తో పాటు ఆధార్‌ సంఖ్య కనిపిస్తుంది. ఒకవేళ ఈకేవైసీ సమయంలో మిషన్‌లో రెడ్‌ లైట్‌ వస్తే వివరాలు సరిగా లేవంటూ రిజక్ట్‌ అవుతంది. ఆధార్‌ కార్డులో పేరు ఎలా ఉందో రేషన్‌ కార్డులో పేరు కూడా అలానే ఉండాలి. లేకుంటే రేషన్‌ కార్డులో ఆ వ్యక్తి పేరు తొలగిస్తారు. ఈ కేవైసీ సమయంలో లేకపోతే నమోదు కాదు. దీంతో ఆ వ్యక్తి పేరు కార్డు నుంచి తొలగిస్తారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు ఇంకా రేషన్‌ కార్డులో ఉండడంతో వారికి ప్రతి నెల రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన ఈకేవైసీతో ఆ వ్యక్తి పేర్లు తొలగిస్తారు.
ఊర్లో లేనివారు వేలిముద్రలు పడని వారి పరిస్థితి
రేషన్‌ షాపుల్లో వేలిముద్రలు వేసే సమయంలో ఊర్లో లేని వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చాలామంది ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్లారు. జగిత్యాల జిల్లాలో చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. ఆ సమయంలో రాకుంటే వారి పేర్లను రేషన్‌ కార్డ్‌ జాబితా నుంచి తొలగిస్తారని ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అంత కాకుండా వయసు ఎక్కువ అయినవారు చిన్న పిల్లలు ఆధార్లో బయోమెట్రిక్‌ చేసుకుని వారు వేలిముద్రలు ఈపాస్‌ మిషన్‌లో పడవు వారి పేర్లు తొలగించడమేనా…బియ్యం రావేమోనని ఆందోళన పడుతున్నారు. వారికోసం ఎలా వ్యవహరిస్తారని వినియోగదారులు పేర్కొంటున్నారు. పోర్టబులిటి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా బియ్యం తీసుకునేవారు అక్కడే మీకు దగ్గరలోనే రేషన్‌ దుకాణాల్లోనే ఈ కేవైసీ చేయించుకోవచ్చు అని అధికారులు అంటున్నారు.
గల్ఫ్‌ కార్మికులకు బియ్యం కోత పడేనా..
జగిత్యాల జిల్లాలో ఉపాధి నిమిత్తం బతుకు దెరువు కోసం పొరుగు రాష్ట్రాలు, గల్ఫ్‌ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఈ కేవైసీ పెట్టడంతో వేలి ముద్ర వేయక పోవడంతో రేషన్‌ కార్డు నుండి పేరు తొలగిస్తారేమోనని, బియ్యం కోత విధిస్తారేమననే ఆందోళన వారి కుటుంబల్లో వ్యక్తమవుతుంది. వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి వేడుకుంటున్నారు.

రేషన్‌కార్డులో ఉన్న వారు ఈకేవైసీ చేసుకోవాలి
కుటుంబంలో ఉన్నా సభ్యులు అందరూ వీలయినంత త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలి. ఆరోగ్య శ్రీ, ఫుడ్‌ సెక్యూరిటీకి ఎంతో ఉపయోగపడుతుంది. గల్ఫ్‌కు వెళ్లినవారు 25శాతం ఉంటే మొత్తం 75శాతం లబ్ధిదారులు ఈ కేవైసీ అయిపోయినా అనంతరం గల్ఫ్‌కి సంబంధించిన వారికి మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంటుంది. 8లక్షలు 85యూనిట్లు ఉండగా ఇప్పటి వరకు 96వేల మంది లబ్ధిదారుల పూర్తి అయినవి. ఈ కేవైసీ ప్రక్రియ 12 తేదీన ప్రారంభించగా అంతక ముందే రేషన్‌ పంపిణీ చేయడంతో తక్కువ పూర్తయ్యాయి. వచ్చే నెల మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది.
– వెంకటేశ్వరరావు, డీఎస్‌వో జగిత్యాల

Spread the love