ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బద్దలు కొట్టిన రికార్డుల లిస్ట్ ఇదే

నవతెలంగాణ – హైదరాబాద్
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లకు సన్‌రైజర్స్ బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాలను మోతెక్కిస్తున్నారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్లను నమోదు చేసిన ఆ జట్టు తాజాగా మరో భారీ స్కోరు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తొలి బ్యాటింగ్ చేసి 266 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ 67 పరుగుల తేడాతో గెలిచింది. అయితే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి.
పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు
గత మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే 89 పరుగులు బాదాడు. యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 46 పరుగులు కొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 38 బంతుల్లోనే 131 పరుగులు జోడించారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నిలిపారు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా తొలి 100 పరుగులు
1. ఢిల్లీపై సన్‌రైజర్స్ – 5 ఓవర్లు (శనివారం రాత్రి)
2. పంజాబ్‌పై చెన్నై – 6 ఓవర్లు (2014)
3. ఆర్సీబీపై కోల్‌కతా – 6 ఓవర్లు (2017)
4. ముంబైపై సీఎస్కే – 6.5 ఓవర్లు (2015)
5. ముంబైపై సన్‌రైజర్స్ – 7 ఓవర్లు (2024)

సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధ శతకాలు
1. ముంబైపై అభిషేక్ శర్మ – 16 బంతులు (2024)
2. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ – 16 బంతులు ( శనివారం రాత్రి)
3. ముంబైపై ట్రావిస్ హెడ్ – 18 బంతులు (2024)
4. సీఎస్కేపై డేవిడ్ వార్నర్ – 20 బంతులు (2015)
5. కోల్‌కతాపై డేవిడ్ వార్నర్ – 20 బంతులు (2017)

ఐపీఎల్ పవర్‌ప్లే అత్యధిక 50+ స్కోర్లు
1. డేవిడ్ వార్నర్ – 6
2. క్రిస్ గేల్ – 3
3. సునీల్ నరైన్ – 3
4. ట్రావిస్ హెడ్ -3

పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్ చేసిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు
1. ఢిల్లీపై ట్రావిస్ హెడ్ – 84 (26) (శనివారం రాత్రి)
2. కోల్‌కతాపై – డేవిడ్ వార్నర్ – 62*(25) -(2019)
3. ముంబైపై ట్రావిస్ హెడ్ – 59*(20) -( 2024)
4. సీఎస్కేపై డేవిడ్ వార్నర్ – 59*(23) (2015)

ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు
1. ఢిల్లీపై సన్‌రైజర్స్ – 125/0 (శనివారం రాత్రి)
2. ఆర్సీబీపై కోల్‌కతా – 105/0 (2017)
3. పంజాబ్‌పై సీఎస్కే – 100/2 (2014)
4. ముంబైపై సీఎస్కే – 90/0 (2015)
5. ఢిల్లీపై కోల్‌కతా – 88/1 (2024)
6. సన్‌రైజర్స్‌పై ఢిల్లీ – 88/2 (శనివారం రాత్రి)

Spread the love