గ్రామ అభివృద్ధికి పట్టుదలతో కృషి చేస్తున్న ఆ నలుగురు..

– సబ్ స్టేషన్ మంజూరు ఎమ్మెల్యే చేత భూమి పూజ

– సబ్స్టేషన్ అభివృద్ధికి మూడు కోట్లు నిధులు ఏ ఈ అరవింద్
నవతెలంగాణ-  మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ అభివృద్ధికి ఆ గ్రామ సర్పంచ్ హారిక శ్రీనివాస్ పటేల్, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి శంకర్ పటేల్, డైరెక్టర్ సుధాకర్ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్ ఈ నలుగురి పట్టుదల ఆ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామానికి సబ్ స్టేషన్ అవసరమని ఎమ్మెల్యే హనుమంతు సిందే కు విన్నవించగా పెద్ద ఏక్లారా గ్రామానికి ఎమ్మెల్యే కృషి ఫలితం సబ్ స్టేషన్ మంజూరు చేయించారు. ఈ సబ్ స్టేషన్ అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు అవుతాయని ట్రాన్స్కో ఏ ఈ అరవింద్ తెలిపారు. ఈ గ్రామానికి మంజూరైన సబ్ స్టేషన్ ఏర్పాటుతో ఐదు గ్రామాలకు కరెంటు సరఫరా అవుతుందని ఏఈ వివరించారు. మా విన్నపాన్ని మన్నించి మా గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ గ్రామ ఎంపీటీసీ గ్రామ పెద్దలు ప్రత్యేకంగా సన్మానించారు. సబ్స్టేషన్ ఏర్పాటుకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే శుక్రవారం నాడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు సరఫరా కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని బోరు బావులతో పాటు ప్రతి ఇంటికి 24 గంటల పాటు కరెంట్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో సబ్స్టేషన్లో మంజూరు చేయించడం జరిగిందని పెద్ద ఎక్లారాతో పాటు నియోజకవర్గంలోని మరో మూడు సబ్స్టేషన్లో ఒకేసారి మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూమి పూజ అనంతరం సభలో మాట్లాడుతూ.. తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లో 25వేల బోరు బావులు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ మండల జెడ్పిటిసి కుటుంబ సభ్యులు కథలయ్య శ్రీనివాస్ పటేల్ డైరెక్టర్ సుధాకర్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ పండిత్రా పటేల్ ఎంపిటిసి కుటుంబ సభ్యులు శంకర్ పటేల్ ట్రాన్స్కో జిల్లా అధికారి ఎస్సీ ఏడి మండల అభివృద్ధి అధికారి రాసిశ్వర్ గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బంసి పటేల్ గ్రామ కార్యదర్శి కృష్ణవేణి ట్రాన్స్కో అధికారులు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love