దళిత యువకులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

– డీహేచ్ పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బోనగిరి రూపేశ్ 
– మందమర్రి ఘటనపై ప్రభుత్వాధికారులు నిర్లక్యంగా వ్యవహరిస్తున్నారని మండిపాటు 
నవతెలంగాణ-బెజ్జంకి 
మేకను దొంగిలించారనే నేపంతో మందమర్రిలోని దళిత యువకులపై దాడి చేసిన వ్యక్తులపై ప్రభుత్వాధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి బోనగిరి రూపేశ్ సోమవారం డిమాండ్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక దళిత సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దళిత సామాజిక వర్గాలను అణచివేతకు గురిచేస్తున్నాయని రూపేశ్ మండిపడ్డారు.మందమర్రి ఘటనను దళిత హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోందని.. ప్రభుత్వాధికారులు దాడి చేసిన వ్యక్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా త్వరితగతిన స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని రూపేశ్ కోరారు.
Spread the love