ఒక కొడుకు ఉన్న వారికి గాజులు వేయించాలి

నవతెలంగాణ-గోవిందరావుపేట : ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి సంక్రాంతి లోగా ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు వేయించాలి లేకపోతే కీడు అని మండల వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా మండల వ్యాప్తంగా గాజుల దుకాణాలు మహిళలతో కిట కిట లు ఆడుతున్నాయి. ఈ ప్రచారం ఎలా పుట్టింది అనేది ఎవరికి అర్థం కాదు పరిస్థితి నెలకొంది. గాజుల దుకాణం వాళ్లే తమ గిరాకీ కొరకు పుట్టించారని కొందరు ప్రచారం చేస్తుండగా 50 రూపాయల గాజుల కోసం ఎందుకు ప్రచారం చేస్తారని మరికొందరు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాగో కొత్త గాజులు పుట్టింటి వారు వేయిస్తారు కాబట్టి దానీ లో భాగంగానే ఈ ప్రచారం జరిగి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక అపార్ట్మెంట్ ని వారందరూ లేక ఒక వీధిలోని వారందరూ ఒకరికి ఒకరు గాజులు వేయించుకుంటూ సామూహికంగా ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. గతంలో మాట్లాడుకొని వారు తగాదా పడిన బంధుమిత్రులు గాజుల కీడు పుణ్యమా అని కలిసిపోయి గాజులు వేయించుకోవడం ఒక విధంగా మంచి జరుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం వల్ల పెద్ద ఆర్థిక భారం లేకపోయినా బంధుత్వం స్నేహం బలపడుతుందని మరికొందరు తెలుపుతున్నారు. ఒకరకంగా ఈ ప్రచారం సమాజానికి మేలే చేసిందన్న అభిప్రాయాన్ని అధికంగా వ్యక్తం చేస్తున్నారు. ఒకరికొకరు పరస్పరం ఐదు రకాల గాజులను వేయించుకోవడం సామూహికంగా ఫోటోలు దిగడం వాట్సాప్ లలో బంధుమిత్రులకు పంపడం ఒక మంచి సెలబ్రేషన్ గా మారిందని తన కుటుంబీకుల మహిళలు అభిప్రాయపడుతున్నారు.
Spread the love