18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి..

-గోషామహల్ నియోజకవర్గం లో 235 పోలింగ్ కేంద్రాలు..

-ఎఈఅర్ఒ ఎమ్ ఎస్ శైలజ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్ అసిస్టెంట్ ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్  (ఎ ఈ ఆర్ ఒ) ఎమ్ ఎస్ శైలజ తెలిపారు. సోమవారం అబిడ్స్ లోని ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ… గోషామహల్ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ‌ ప్రజలకు ఓటు నమోదు పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఇప్పటివరకు  14,500 మంది కొత్త ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 19 తేదీ వరకు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని వాల్ పోస్టర్ల ద్వారా యువతకు,ప్రజలకు, మహిళలకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.  235 మంది బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రజలు వీరందరికీ సహకరించాలని కోరారు.
Spread the love