మూడు సరిహద్దు చెక్ పోస్ట్ లు ఏర్పాటు…

– వాహణ తనిఖీలు ప్రారంభం…

– సిఐ కరుణాకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నికల నోటిఫికేషన్ నేపద్యంలో అక్రమ రవాణాను అరికట్టడానికి అశ్వారావుపేట నియోజక వర్గానికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉండటంతో మూడు వైపులా పోలీస్ నిఘా సరిహద్దు చెక్ పోస్టు లు ఏర్పాటు చేసినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. అశ్వారావుపేట నియోజక వర్గానికి అశ్వారావుపేట భూర్గంపాడ్ రోడ్ లో నందిపాడు, అశ్వారావుపేట – వెలేరుపాడు రోడ్ లో కొత్తూరు, అశ్వారావుపేట – జంగారెడ్డిగూడెం రోడ్లో జీలుగుమిల్లి సమీపంలో చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
Spread the love