
– సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క రావాలని పట్టు
– ఎంపీడీఓ సూచనతో దిగొచ్చిన వైనం
నవతెలంగాణ – బెజ్జంకి
వృద్ధులకు,అనాథ పిల్లలకు అనాథ ఆశ్రమం నిర్మించాలని ముగ్గురు యువకులు మండల కేంద్రంలోని సెల్ టవరెక్కి గురువారం నిరసన తెలిపారు.కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంట పల్లి,జంగపల్లి గ్రామాలకు చెందిన బామండ్ల రాజు,కొంకటి వేణు,మంకాల ప్రశాంత్ కరీంనగర్ పట్టణంలో పలువురు వృద్ధులకు, అనాథలకు తోచిన విధంగా సహయమందజేస్తూ సామాజిక సేవ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వృద్ధులకు,అనాథలకు బెజ్జంకి మండలంలో ఆశ్రమం నిర్మించాలనే ప్రధాన డిమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క వచ్చి హామీ ఇవ్వాలని సుమారు రెండు గంటల పాటు టవరెక్కి నిరసన తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మీ డిమాండ్ ను అధికారుల దృష్టికి తీసుకువేళ్లేల కృషి చేస్తామని పలుమార్లు సూచించిన తిరస్కరించి టవరెపైనే మాకు సంబంధించిన వారు రావాలని పట్టబట్టారు.ఎంపీడీఓ లక్ష్మప్ప టవర్ వద్దకు చేరుకుని మీ డిమాండ్ ను పై అధికారుల దృష్టికి తీసుకువేళ్లే యత్నం చేస్తామని సూచించడంతో యువకులు టవర్ దిగిరావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.తమ ఆర్థిక ప్రయోజనాలు, గుర్తింపు,సంచలనం కోసమో నిరసన తెలుపలేదని.. ఎందరో వృద్దులు,అనాథలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువేళ్లాలనే సదుద్దేశ్యంతోనే టవరెక్కి నిరసన తెలిపినట్టు బామండ్ల రాజు ఎంపీడీఓ వద్ద అవేదన వ్యక్తం చేశారు.యువకుల డిమాండ్ ను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లే యత్నం చేస్తామని ఎంపీడీఓ సూచించారు.
అత్మహత్యలకు నిలయంగా: మండల కేంద్రంలోని ఎయిర్ టెల్ టవర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో అత్మహత్యలకు నిలయంగా మారింది.గతంలో యువకుడు టవర్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జరిగింది.మరికొందరు అత్మహత్యయత్నాలకు పాల్పడగా పోలీస్ అధికారుల ప్రత్యేక చోరవతో ప్రమాదాలు తప్పాయి.అత్మహత్యయత్నాలకు నిలయంగా మారిన ఎయిర్ టెల్ టవర్ చుట్టు కంచె ఏర్పాటుచేసేల సంబంధిత అధికారులు తక్షణ చోరవచూపితే ప్రమాదాలను నివారించవచ్చు.