నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. నరేంద్ర చౌదరి… సీఎంను లంచ్‌కి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Spread the love