సమయం చేసిన సాయం

time
done
helpనాని నటిస్తున్న నయా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హారు నాన్నా’. ఫస్ట్‌ సింగిల్‌ ‘సమయమా..’ ప్రోమోతో అలరించిన మేకర్స్‌ తాజాగా ఈ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘సమ యమా..’ పాట మనసుని ఆకట్టుకునే మోడ్రన్‌ టచ్‌ ఉన్న బ్యూటీఫుల్‌ సాంగ్‌. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌, హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఆర్కెస్ట్రేషన్‌, బేస్‌ ట్రాక్‌ గిటార్‌ బీట్స్‌ ఎక్స్‌ ట్రార్డినరీగా ఉన్నాయి. ట్యూన్‌, ప్రొగ్రషన్‌ కట్టిపడేస్తున్నాయి. నాని, మణాల్‌ ఠాకూర్‌ అద్భుతమైన కెమిస్ట్రీతో విజువల్స్‌ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. డిసెంబర్‌ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spread the love