ఆద్యంతం వైవిధ్య భరితం

throughout
Diversity toleranceమిలియన్ల మంది ఫాలోవర్లను కలిగిన పాపులర్‌ యూట్యూబర్‌, ఫిలాంత్రోపిస్ట్‌ హర్ష సాయి పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందు తున్న చిత్రంతో బిగ్‌ స్క్రీన్‌లోకి అడుగు పెడుతున్నారు. హర్ష సాయి స్వయంగా రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ పిక్చర్స్‌ బ్యానర్‌పై మిత్ర నిర్మించారు. ఈ సినిమాలో మిత్ర హీరోయిన్‌గా కూడా నటిస్తున్నారు. కల్వకుంట్ల వంశీధర్‌రావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి పడవల బాలచంద్ర సహ నిర్మాత. ఆదివారం చిత్ర యూనిట్‌ నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో టీజర్‌ ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘మెగా’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ పెట్టారు. లో డాన్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సందర్భంగా నిర్మాత మిత్ర మాట్లాడుతూ, ‘చిన్న ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ చాలా భారీస్థాయిలోకి వెళ్ళింది. చాలా మంచి టెక్నికల్‌ టీం పని చేస్తోంది. మీ రియల్‌ హీరో హర్ష సాయిని రీల్‌ హీరోగా ప్రెజెంట్‌ చేయడం శ్రీ పిక్చర్స్‌కు దక్కిన అదష్టం. ఈ సినిమాతో అతను మీ మనసుల్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. హీరో, దర్శకుడు హర్ష సాయి మాట్లాడుతూ, ‘టైటిల్‌, టీజర్‌ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మంచి టెక్నికల్‌ టీంతో ఈ సినిమా చేస్తున్నాం. కార్తీక్‌ పళని సినిమాటోగ్రఫీ, అంజి మాస్టర్‌ ఫైట్స్‌ అద్భుతంగా ఉంటాయి’ అని తెలిపారు.

Spread the love