మౌత్‌టాక్‌ వల్లే ఈ బ్లాక్‌బస్టర్‌ సాధ్యమైంది

Because of the word of mouth This is a blockbuster It was possibleనవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మహేశ్‌ బాబు.పి. మాట్లా డుతూ, ‘సినిమా బాగుందనే మౌత్‌ టాక్‌తో మా సినిమాకు ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌. నాకు వచ్చిన ఐడియాను నవీన్‌, యూవీ, అనుష్క నమ్మకుంటే ఈ సినిమా రూపొంది, ఇంత సక్సెస్‌ అయ్యేది కాదు’ అని తెలిపారు. ‘అనేక ఇబ్బందుల మధ్య మాకు ఇంత పెద్ద హిట్‌ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. మంచి సినిమా అనే వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌తోనే ఇది సాధ్యమైంది. అనుష్కతో కలిసి నటించడం హ్యాపీ ఎక్సీపిరియన్స్‌. ఇవాళ మా పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ బాగుందని, మంచి లవ్‌ స్టోరీ చూపించారని ప్రశంసలు వస్తున్నాయి. చిరంజీవి సినిమా హిట్‌ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే రిజల్ట్‌ వచ్చింది’ అని హీరో నవీన్‌ పోలిశెట్టి అన్నారు. డైరెక్టర్‌ బుచ్చిబాబు మాట్లాడుతూ,’యూవీ సంస్థకు హిట్‌ రావడం సంతోషంగా ఉంది. నవీన్‌ ఇంకా ఇలాంటి మరెన్నో హిట్‌ మూవీస్‌ చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ”జాతి రత్నాలు’ సినిమా టైమ్‌లో నాకు డైరెక్టర్‌ మహేశ్‌ ఈ కథ చెప్పాడు. అప్పటి నుంచి ఈ స్టోరీ మీద వర్క్‌ చేస్తూనే ఉన్నాడు. నవీన్‌ కామెడీ మాత్రమే చేస్తాడని అనుకుంటారు కానీ ఈ సినిమాలో ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే బాగా చేయ గలిగాడు’ అని డైరెక్టర్‌ అనుదీప్‌ కేవీ అన్నారు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, ‘కామెడీ మాత్రమే నవీన్‌ స్ట్రెంత్‌ అనుకుంటాం. కానీ అతను యాక్షన్‌, విలన్‌, కామెడీ, ఎమోషన్‌ ఏదైనా చేయ గలడు. అలాంటి వర్సటైల్‌ రోల్స్‌ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఎమోషన్‌ సీన్స్‌తో కొన్నిసార్లు ఏడిపించాడు. నవీన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూశా. అందరం ఎంజారు చేశాం’ అని అన్నారు. ‘ఒక కొత్త పాయింట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయడం మాములు విషయం కాదు. ఇదొక మంచి మూవీ. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు.

Spread the love