ఐ యామ్‌ విత్‌ యూ..

I am With you..బాబా పి.ఆర్‌ దర్శకత్వంలో సూర్య భరత్‌ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా ఎమ్‌.కె.ఎ.కె.ఎ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న సినిమా ‘అష్టదిగ్బంధనం’. ఏ గేమ్‌ విత్‌ క్రైమ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ఈ సినిమా నుంచి ‘ఐయామ్‌ విత్‌ యూ..’ అనే సాంగ్‌ను ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా లాంచ్‌ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు. ‘మేము రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదే విధంగా ఈనెల 22న రిలీజ్‌ అయ్యే మా సినిమా మీకు నచ్చుతుందని, మీ అందరి రెస్పాన్స్‌ కూడా బాగుంటుందని మేము నమ్మకంగా ఉన్నాం’ అని దర్శకుడు బాబా పి.ఆర్‌ చెప్పారు. నిర్మాత మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘మీ అందరికీ ఈ సినిమా వేల్యూ ఫర్‌ మనీ కనిపిస్తుంది’ అని చెప్పారు.

Spread the love